గత ఆరు రోజులుగా ఉక్రెయిన్ పై రష్యా దాడులు చేస్తూనే ఉంది. అయితే అక్కడికి చదువు నిమిత్తం వెళ్లిన భారత విద్యార్థి ఉక్రెయిన్ లో మృతి చెందాడు. ఈ విషయాన్ని భారత విదేశాంగ శాఖ ప్రకటించింది. ఖార్కివ్ లో జరిగిన కాల్పుల్లో విద్యార్థి చనిపోయాడని తెలిపింది. మృతి చెందిన విద్యార్థి కర్ణాటకకు చెందిన నవీన్ గా గుర్తించారు. భోజనం కోసం విద్యార్థి నవీన్ బయటకు వెళ్లిన సందర్భంగా కాల్పులు జరగడంతో కాల్పుల్లో విద్యార్థి చనిపోయినట్లు విదేశాంగ శాఖ తెలిపింది.
ఉక్రెయిన్ లో భారత విద్యార్థి మృతి
March 01, 2022
0
Tags