ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లాల ఏర్పాటుతో పాటు రాజధాని మార్పునకు ఏప్రిల్‌ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తుది గడువుగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. రాజధానిని త్వరలో అమరావతి నుంచి విశాఖపట్నానికి మార్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మూడు రాజధానుల అంశాన్ని పక్కనబెట్టి విశాఖపట్నాన్నిఏపీ రాజధానిగా చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తెలుగు నూతన సంవత్సరమైన ఉగాది నుంచి.. విశాఖపట్నం కేంద్రంగా ముఖ్యమంత్రి కార్యకలాపాలు నిర్వహించాలని సీఎం భావిస్తున్నట్లు తెలుస్తుంది. సినీ పరిశ్రమ వర్గాల భేటీలో కూడా విశాఖపట్నంలో సినిమా పరిశ్రమను విస్తరించాలని కోరారు సీఎం. ఇందుకోసం ప్రభుత్వ సహాయం కూడా ఇస్తామని తెలిపారు. పరిపాలనకు అవసరమైన కొత్త భవనాల నిర్మాణానికి అవసరమైన భూముల గుర్తింపును ప్రారంభించాలని కూడా అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. ఈ విషయంపై అభ్యంతరాలు తలెత్తితే.. అవి హేతుబద్ధంగా ఉంటే వాటి పరిశీలనకు ప్రాధాన్యత ఇవ్వాలని కూడా స్పష్టం చేసినట్లు తెలిసింది. ఇక ఉగాది నుంచే కొత్త జిల్లాలు అందుబాటులోకి రానున్న నేపథ్యంలో.. కలెక్టర్లు, ఎస్పీలు కార్యకలాపాలు ప్రారంభించేందుకు వీలుగా సన్నాహాలు ప్రారంభించాలని ఆదేశించారు సీఎం జగన్. కొత్తగా ఏర్పడే జిల్లాలకు అనుభవజ్ఞులైన వారిని నియమించడం ద్వారా పరిపాలన సులభతరమవుతుందని సీఎం జగన్ భావిస్తున్నారు.
ఉగాది నుంచి రాజధానిగా విశాఖపట్నం?
February 12, 2022
0
Tags