తెలంగాణలోని శంకర్పల్లి గ్రామపంచాయితీ పరిధిలోని తన స్థలాన్ని కొందరు ఆక్రమించుకోవడంతో.. హైకోర్టును ఆశ్రయించిన చిన్నికృష్ణ స్టే ఆర్డర్ తెచ్చుకున్నారు. దీంతో ఆగ్రహించిన స్థానిక రియల్టర్లు.. చిన్నికృష్ణపై దాడికి యత్నించారు. పరుష పదజాలంతో దూషించారని చిన్నికృష్ణ తెలిపారు. ఈ ఘటనపై శంకర్పల్లి పీఎస్ లో ఫిర్యాదు చేశారు చిన్నికృష్ణ. కొవిడ్‌తో ఇబ్బందిపడుతున్న తనను. ఇంట్లోకి చొచ్చుకొచ్చి బెదిరించారని చెప్పారు. స్థానిక గ్రామపంచాయితీవారు.. తన స్థలానికి క్లియర్ పిక్చర్ ఇచ్చారనీ చెప్పారు. అయినప్పటికీ కావాలని వివాదం చేస్తున్నారని ఆరోపించారు. కోర్టులను కూడా అగౌరవపరిచేలా మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
సినీ చిన్నికృష్ణపై దాడికి యత్నం
February 20, 2022
0