రష్యాకు చెందిన ఆంటోనోవ్ యాన్-26 మిలటరీ రవాణా విమానం ఉక్రెయిన్ సమీపంలో రష్యాలోని దక్షిణ వొరోనెజ్ ప్రాంతంలో కుప్పకూలినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. స్థానికి మీడియా కథనం ప్రకారం మిలిటరీ పరికరాలను రవాణా చేస్తుండగా రష్యన్ ఏరోస్పేస్ దళాలకు చెందిన ఏఎన్-26 విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో అందులోని సిబ్బంది మొత్తం మరణించారని, ప్రమాదానికి సాంకేతిక లోపమే కారణమని రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. అయితే ఈ ప్రమాదం కారణంగా నేలపై ఎటువంటి విధ్వంసం జరగలేదని పేర్కొంది. విమాన ప్రమాదం జరిగినట్లు ధృవీకరించినప్పటికీ, అందులో ఎంత మంది మరణించారో చెప్పడానికి రక్షణశాఖ నిరాకరించింది. ఏఎన్-26 విమానంలో ఆరుగురు సిబ్బందితో పాటు 38 మంది సైనికులు ఉన్నట్లు సమాచారం.
కుప్పకూలిన రష్యా మిలటరీ రవాణా విమానం
February 25, 2022
0
Tags