నటి ప్రగతిపై లైంగిక వేధింపులు....!

Telugu Lo Computer
0


తెలుగు సినీ పరిశ్రమలో అందం అభినయం కలగలిపిన సీనియర్ నటి ప్రగతి. సినిమాల కంటే వ్యక్తిగత వార్తలతో సోషల్ మీడియాలో క్రేజ్ దక్కించుకుంది. టాలీవుడ్ నంబర్ వన్ హీరోయిన్స్ రష్మిక, పూజ హెగ్డే వంటి హాట్ హీరోయిన్స్ కి పోటీనిస్తూ నెట్టింట్లో దూసుకెళ్ళటం ప్రగతి స్టైల్. తన స్పెషల్ పెర్ఫామెన్స్ తో నిత్యం వార్తల్లో నిలుస్తూ ట్రెండింగ్ లో ఉండే నటి ప్రగతి మరోసారి సోషల్ మీడియాలో సెన్సేషన్ అవుతుంది. ప్రతిసారి జిమ్ వర్కౌట్ వీడియోస్, డాన్స్ వీడియోస్ తో సోషల్ మీడియాలో వైరల్ అయ్యే ప్రగతి ఈ సారి కాస్టింగ్ కౌచ్ ఆరోపణలతో ట్రెండ్ అవుతుంది. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో తనకి దారుణమైన పరిస్థితులు ఎదురయ్యాయని చెప్తూ కాస్టింగ్ కౌచ్ పై షాకింగ్ కామెంట్స్ చేసిందట!. ఏ విషయాన్నైనా ఉన్నది ఉన్నట్టు మాట్లాడే అలవాటున్న ప్రగతి తానూ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో దర్శకులు, నిర్మాతలే క్లాకుండా ఒక స్టార్ హీరో నుండి కూడా లైంగిక వేధింపులకి గురైనట్టు సంచలన కామెంట్స్ చేసిన వార్త వైరల్ అవుతుంది. తనతో గడిపితే సినిమాలో అవకాశం ఇస్తానని ఒక స్టార్ హీరో తనకి ఆఫర్ ఇచ్చాడని ప్రగతి కామెంట్స్ చేసినట్టుగా వార్తలొస్తున్నాయి. అయితే ఎలాగోలా ఆ హీరో దగ్గరి నుంచి ప్రగతి తప్పించుకుందట!. ఆ హీరో ఎవరనేది మాత్రం ఆమె సీక్రెట్‌గా ఉంచిందట. అయితే ఆమె ఏ ఇంటర్వ్యూలో ఈ కామెంట్స్‌ చేసిందో తెలియదు కానీ.. దానికి సంబంధించిన వార్తలు మాత్రం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. గతంలో కూడా పలుమార్లు క్యాస్టింగ్‌ కౌచ్‌ గురించి ప్రగతి మాట్లాడిన సంగతి తెలిసిందే.


Post a Comment

0Comments

Post a Comment (0)