ఈ రక్కసి చాలా డేంజర్!

Telugu Lo Computer
0


కరోనా తగ్గినట్టే తగ్గి మరో కొత్త వేరియంట్లతో విరుచుకుపడుతోంది. దాదాపు రెండేళ్లుకు పైగా కరోనా విలయతాండవం కొనసాగుతోంది. ఆల్ఫా, బీటా వేరియంట్ల తర్వాత డెల్టా వేరియంట్ విజృంభించింది ఆ తర్వాత ఒమిక్రాన్ అనే కొత్త వేరియంట్ పుట్టుకొచ్చింది. ఇంతకీ ఈ వేరియంట్లన్నీ కరోనా నుంచి వచ్చినవే అయినప్పటికీ రానురాను మ్యుటేషన్ చెందుతూ మునుపటి వేరియంట్ల కంటే ప్రమాదకరంగా మారుతున్నాయి. ఇతర కరోనా వేరియంట్ల కంటే దక్షిణాఫ్రికాలో కనిపించిన ఒమిక్రాన్ అత్యంత ప్రమాదకరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ  సైతం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ వేరియంట్ ప్రాణాంతకమని, కొద్దినెలల్లోనే మిలియన్లకు పైగా కరోనావైరస్ కేసులు నమోదవుతున్నాయని  ప్రపంచ ఆరోగ్య సంస్థ  డైరెక్టర్ జనరల్  హెచ్చరిస్తున్నారు. కొన్నివారాలుగా ఒమిక్రాన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడుతోందని, 10వారాల క్రితమే 90 మిలియన్ల కరోనావైరస్ కేసులు నమోదయ్యాయని  ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ హెచ్చరిస్తున్నారు. కరోనావైరస్ మహమ్మారి ప్రారంభమైన 2020 మొత్తం ఏడాది కంటే ఎక్కువగా నమోదయ్యాయని టెడ్రోస్ అన్నారు. ఇప్పటికే చాలా దేశాలు కరోనాను కట్టడి చేసేందుకు లాక్ డౌన్లు, కర్ఫ్యూలు వంటి కఠినమైన ఆంక్షలు విధిస్తున్నాయి. అయినప్పటికీ ఈ కరోనా విలయతాండవం ఆగడం లేదు. రోజురోజుకీ కరోనా కేసుల తీవ్రత పెరుగుతూనే ఉన్నాయి. కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నాయి. కొన్ని దేశాల్లో ఒమిక్రాన్ కేసుల తీవ్రత కూడా భారీగానే కనిపిస్తోంది. ఒమిక్రాన్ బారినపడిన వారిసంఖ్య పెరుగుతూ పోతోంది. కాకపోతే ఒమిక్రాన్ కారణంగా మరణాల సంఖ్య గతంలో వేరియంట్ల కంటే తక్కువగా ఉన్నట్టు పలు అధ్యయనాలు చెబుతున్నాయి. కరోనా కేసుల తీవ్రత పెరగడానికి కారణాలపై అనేక భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. చాలా దేశాలు ప్రజల ఇబ్బందుల దృష్ట్యా లాక్ డౌన్, ఆంక్షలను సడలించడంతో తగ్గన కరోనా కేసులు మళ్లీ పెరిగిపోతున్నాయి. ఒమిక్రాన్ మునుపటి వేరియంట్ల కన్నా తక్కువ తీవ్రమైనది అయినప్పటికీ తక్కువ అంచనా వేయకూడదని టెడ్రోస్ అధనామ్ హెచ్చరిస్తున్నారు. అయితే ప్రపంచంలో ని చాలా దేశాల్లో ఒమిక్రాన్ మరణాల సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోందని ఆయన అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే అన్ని దేశాల్లో కరోనా వ్యాక్సినేషన్ కొనసాగుతోంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న కరోనా వ్యాక్సిన్లతో వైరస్ ప్రభావాన్ని కొద్దిగా తగ్గించాయనే చెప్పాలి. కొన్ని వ్యాక్సిన్ల ప్రభావంతో కరోనా తగ్గుముఖం పట్టినప్పటికీ అది పూర్తి స్థాయిలో సాధ్యపడదని నిపుణులు సైతం అభిప్రాయపడుతున్నారు. ఒమిక్రాన్ వంటి అత్యంత వేగంగా వ్యాపించే వేరియంట్ తక్కువ తీవ్రత కారణంగా దాని వ్యాప్తిని నిరోధించడం ఇకపై సాధ్యం కాదని అభిప్రాయపడుతున్నారు. ఈ కరోనావైరస్ ఎంత ప్రమాదకరమైనదో రెండేళ్లుగా మన కళ్లముందే కొనసాగుతున్న విలయతాండవాన్ని చూస్తుంటే అర్థమవుతుందని  ప్రపంచ ఆరోగ్య సంస్థ  చీఫ్ టెడ్రాస్ అభిప్రాయపడ్డారు.

Post a Comment

0Comments

Post a Comment (0)