పార్లమెంట్ ఆవరణలో కుప్పకూలిన పిల్లి సుభాష్ చంద్రబోస్

Telugu Lo Computer
0


వైసీపీ రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ కు తీవ్ర అస్వస్థత నెలకొంది. దీంతో ఢిల్లీలోని ఆర్ ఎం ఎల్ ఏ అనే ప్రైవేట్ ఆస్పత్రికి ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ ను ఆయన సిబ్బంది తరలించినట్లు సమాచారం. ఈరోజు మధ్యాహ్నం పూట పార్లమెంటు ఆవరణలో సొమ్మసిల్లి కిందపడిపోయారు పిల్లి సుభాష్ చంద్రబోస్. ఈ నేపథ్యంలోనే హుటాహుటిన పిల్లి సుభాష్ చంద్రబోస్ ను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఢిల్లీలోని ఆర్ఎంఎల్ ఆస్పత్రిలో ఐసీయూలో ఉన్నారు. ఆయనకు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. మరి కాసేపట్లోనే పిల్లి సుభాష్ చంద్రబోస్ హెల్త్ బులిటెన్ ను ఆస్పత్రి వైద్యులు విడుదల చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. 

Post a Comment

0Comments

Post a Comment (0)