మేడారం జాతర ప్రారంభం

Telugu Lo Computer
0


నేటి నుంచి మేడారం మహాజాతర ప్రారంభం కానుంది. ఈ నెల 16వ తేదీ నంచి 19వ తేదీ వరకూ మొత్తం నాలుగు రోజుల పాటు ఈ జాతర జరగనుంది. మేడారం మహా జాతర ప్రతి రెండేళ్లకు ఒకసారి జరుగుతుంది. దేశ, విదేశాల నుంచి అనేక మంది భక్తులు తరలి వస్తారు. ఈసారి మేడారం జాతరకు కోటిన్నర మందికి పైగా భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. దానికి అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ నెల 18వ తేదీన మేడారం జాతరకు ముఖ్యమంత్రి కేసీఆర్ వస్తారు. ఆర్టీసీ జాతర కోసం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. మేడారం జాతరలో భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంది. దాదాపు ఆరు నెలల ముందు నుంచే పనులు ప్రారంభించింది. నేటి నుంచి మేడారం జాతర ప్రారంభం కానుండటంతో తెలంగాణ వ్యాప్తంగా సందడి మొదలయిందనే చెప్పాలి. 

Post a Comment

0Comments

Post a Comment (0)