మేడారంకు హెలికాప్టర్ సర్వీస్

Telugu Lo Computer
0


తెలంగాణ కుంభమేళాగా పిలిచే మేడారం జాతర ప్రారంభం అయింది. ప్రతి ఏడాది మేడారం జాతరకు కేవలం తెలంగాణ రాష్ట్రంలోని జిల్లాల నుంచే కాక ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీగా తరలి వస్తూ ఉంటారు. జాతర వచ్చిందంటే చాలు అటు ఆర్టీసీ అందరికీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయడం లాంటివి చేస్తూ ఉంటుంది. వేల సంఖ్యలో ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేసి ప్రయాణికులకు అందుబాటులో ఉంచుతుంది.   మేడారం జాతరకు వెళ్లే భక్తుల కోసం హెలికాప్టర్ సర్వీసులను అందుబాటులో ఉంచారు. హైదరాబాద్ కరీంనగర్ మహబూబ్ నగర్ హనుమకొండ తదితర నగరాల నుంచి భక్తులు మేడారం వెళ్లేందుకు  హెలికాప్టర్ సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి.  హెలికాప్టర్ లో వెళ్లాలి అనుకునేవారు 09880505905 నెంబర్ కు ఫోన్ చేసి హెలికాప్టర్ బుక్ చేసుకునేందుకు అవకాశం ఉంది. ఒక్కో వ్యక్తికి హనుమకొండ నుంచి మేడారం వెళ్లేందుకు 19999 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. కరీంనగర్ నుంచి మేడారం 75000, హైదరాబాద్ నుంచి మేడారం 75000, మహబూబ్ నగర్ నుంచి మేడారం లక్ష రూపాయలు చార్జీ చేయనున్నట్లు తెలుస్తోంది.

Post a Comment

0Comments

Post a Comment (0)