తమిళ సినీ హీరో విశాల్ కు గాయాలు

Telugu Lo Computer
0


ఏ.వినోద్‌కుమార్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రం 'లాఠీ' షూటింగ్‌లో తమిళ సినీ హీరో విశాల్‌ గాయపడ్దారు. ఈ విషయాన్ని స్వయంగా విశాల్‌ సోషల్ మీడియా ద్వారా తెలిపారు. పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా నటించే ఈ సినిమాలో సునయన హీరోయిన్‌గా నటిస్తోంది. పాన్‌ ఇండియన్‌ స్థాయిలో భారీ ఎత్తున రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది. తాజా షెడ్యూల్‌లో హై ఓల్టేజ్‌ యాక్షన్‌ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. షూటింగ్ జరుగుతున్న సమయంలో విశాల్‌ గాయపడ్డారు. చేతి ఏముకకి గాయం కావటంతో చికిత్స కోసం కేరళ వెళ్తున్నట్టు ఆయన ట్వీట్‌లో పేర్కొన్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)