ప్రిన్స్‌ చార్లెస్‌కు కరోనా!

Telugu Lo Computer
0


బ్రిటన్‌ యువ రాజు ప్రిన్స్‌ చార్లెస్‌కు మరోమారు కరోనా సోకింది. గురువారం ఆయనకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణైందని, దీంతో ఆయన స్వీయ ఐసోలేషన్‌లోకి వెళ్లారని యువరాజు కార్యాలయం తెలిపింది. కరోనా సోకడంతో ముందుగా అనుకున్నట్లు వించస్టర్‌ పర్యటనకు రాలేకపోతున్నందుకు విచారిస్తున్నట్లు ఆయన ట్విట్టర్‌ పేజీలో పోస్టు చేశారు. బుధవారం సాయంత్రం ఆయన బ్రిటిష్‌ మ్యూజియం వద్ద చాలామందిని కలిశారు. ఈ కార్యక్రమంలో ఆయన భార్య కమిల్లా, బ్రిటన్‌ ట్రెజరీ చీఫ్‌ రుషి సనక్‌ తదితరులు కూడా ఉన్నారు. కమిల్లీకు పరీక్షలో నెగెటివ్‌ వచ్చిందని అధికారులు చెప్పారు. చార్లెస్‌కు గతంలో ఒకమారు కరోనా సోకింది. అనంతరం ఆయన మూడు డోసుల టీకా తీసుకున్నారు. ఈ దఫా కరోనా సోకినప్పుడు లక్షణాలు స్వల్పంగా ఉన్నట్లు ఆయన సిబ్బంది చెప్పారు. స్పెయిన్‌ రాజదంపతులకు కూడా కరోనా సోకింది.


Post a Comment

0Comments

Post a Comment (0)