కరోనా నుంచి కోలుకున్న లతా మంగేష్కర్

Telugu Lo Computer
0


ప్రముఖ గాయని లతా మంగేష్కర్ గత కొద్ది రోజుల క్రితం కరోనా బారీన పడ్డ విషయం తెలిసిందే. ప్రస్తుతం లతా మంగేష్కర్ కరోనా నుంచి కోలుకున్నారని మహారాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేశ్ తోపే ప్రకటించారు. ఆమె ఆరోగ్య ప్రస్తుతం నిలకడగా ఉందని అన్నారు. తాను డాక్టర్లతో లతా మంగేష్కర్ ఆరోగ్య పరిస్థితి గురించి చర్చించనట్టు తెలిపారు. లతా మంగేష్కర్ ఇప్పటి వరకు వెంటి లేటర్ పైనే ఉండేదని అన్నారు. కానీ ప్రస్తతం ఆమెకు వెంటి లేటర్ సాయం అవసరం లేదని అన్నారు. అయితే ఆమె ఆక్సిజన్ మాత్రం అందిస్తున్నారని తెలిపారు. అలాగే లతా మంగేష్కర్ ప్రస్తుతం చికిత్సకు స్పందిస్తున్నారని అని తెలిపారు. కాగా లతా మంగేష్కర్ జనవరి 11 న కరోనా బారిన పడ్డారు. దీంతో ఆమె బ్రీచ్ కాండీ ఆస్పత్రిలో చేరారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)