ఉద్యోగులకు మంత్రి బొత్స వార్నింగ్!

Telugu Lo Computer
0


ఉద్యోగులు మాట్లాడేటప్పడు జాగ్రత్త వహించాలని, వారు దుర్భాషలాడుతూ మాట్లాడే మాటలకు ఉద్యోగ సంఘాల నేతలు బాధ్యత వహించాల్సి వస్తుందని, పర్యవసానాలు ఖచ్చితంగా ఉంటాయని స్పష్టం చేశారు. మేం ఎంతో సంయమనంతో వ్యవహరిస్తున్నామని ఆయన అన్నారు. మేం మాట్లాడేలేక కాదు, బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్నామని, మీరు కూడా హుందాగా మాట్లాడాలని సూచించారు. ఉద్యోగులను పలుమార్లు చర్చలకు ఆహ్వానించామని, ఇప్పటికీ మూడు రోజుల నుంచి వేచి చూస్తున్నామని అయినా ఉద్యోగులు రాలేదని బొత్స అన్నారు. ఉద్యోగుల కోరికలు సమంజసంగా, చట్టబద్ధంగా ఉండాలని, రాష్ట్ర పరిస్థితిని కూడా పరిగణలోకి తీసుకుని కోరికలు కోరాలన్నారు. ఓ పక్క నిరసన తెలియజేస్తూనే మరోవైపు ఒకటో తారీఖున జీతాలు కావాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారని ప్రభుత్వం అందుకుతగ్గట్టుగానే ఉద్యోగులకు జీతాలు ఇచ్చేందుకు ప్రయత్నిస్తోందని బొత్స అన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)