టీడీపీ నేత దారుణ హత్య

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా మాచర్ల నియోజకవర్గం వెల్దుర్తి మండలం గుండ్లపాడు గ్రామ టీడీపీ అధ్యక్షుడు తోట చంద్రయ్యను ప్రత్యర్థులు నరికి చంపారు. చంద్రయ్య గ్రామ సెంటర్‌లో కూర్చుని ఉన్న సమయంలో ఈ ఘటన జరిగింది. హత్య అనంతరం ప్రత్యర్థులు అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనపై సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ హత్య రాజకీయ కోణంలో జరిగిందా? లేక పాత కక్షలు ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)