ఇంగ్లాండ్ లోని లింకన్‌షైర్‌కు చెందిన మోనికా అల్మేడా (37) నవంబర్ 9న కరోనాతో ఆస్పత్రిలో చేరింది. నవంబర్ 16న పరిస్థితి విషమించి ఆమె కోమాలోకి వెళ్లింది. దీంతో వెద్యులు ఆమెకు ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు. చికిత్స ప్రణాళికలో భాగంగా శృంగార సామర్థ్యాన్ని పెంచే వయాగ్రాను ఆమెకు అధిక మోతాదులో ఇచ్చారు. దీనకి ఆమె అంతకు ముందే తన సమ్మతిని తెలియజేసింది. వయాగ్రా అధిక మొత్తంలో ఇవ్వడంతో ఆమె శరీరంలోని ధమనులను మరింత ఉద్వేగానికి గురిచేసి రక్తప్రసరణ సాఫీగా జరిగి కోమా నుంచి బయటపడింది. దీంతో డిసెంబర్ 14న కోమా నుంచి బయటపడి తిరిగి ఇంటికి చేరుకుందని వైద్యులు తెలిపారు. కాగా, నైట్రస్ ఆక్సైడ్ మాదిరిగానే వయాగ్రాను కూడా ఆక్సిజన్ స్థాయిలను పెంచుకోవడానికి ఉపయోగించవచ్చో లేదో తెలుసుకోవడానికి పలు పరీక్షలు నిర్వహించాల్సి ఉందని వైద్యులు తెలిపారు.
వయాగ్రా వాడటంతో కోమా నుండి బయటపడిన యువతి
January 06, 2022
0
Tags