బిల్లులు ప్రాసెస్ చేయాలంటే ఎస్ఆర్ లు కావాలి !

Telugu Lo Computer
0


కొత్త పే స్కేళ్ల ప్రకారం బిల్లులు ప్రాసెస్ చేయాలంటే ఎస్ఆర్ లు కావాలని డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీ అండ్ అకౌంట్సుకు ఏపీ ట్రెజరీ సర్వీసెస్ అసోసియేషన్ లేఖ రాసింది. సర్వీస్ రిజిస్టర్లు వెరిఫికేషన్ తరువాతే పే ఫిక్సేషన్ చేయగలమని లేఖలో పేర్కొంది. తప్పు గా చెల్లింపులు చేస్తే డీడీఓలను ట్రెజరీ ఆఫీసర్లను బాధ్యులు చేస్తామంటూ జీవో జారీ చేశారన్న విషయాన్ని లేఖలో ప్రస్తావించారు ఉద్యోగులు. ఎక్కువ చెల్లింపులు జరిపితే డీడీఓలు, ట్రెజరీ ఉద్యోగుల నుంచి రికవరీ పెడతామని పీఆర్సీ జీవోల్లో స్పష్టం చేశారని లేఖలో ట్రెజరీ ఉద్యోగులు పేర్కొన్నారు. బిల్లులతో పాటు ఎస్ఆర్ లు అందుబాటులోకి వస్తే తప్ప ఏం చేయలేమని లేఖలో స్పష్టం చేసింది. తమకు కావాల్సిన సమయం ఇవ్వకపోతే పొరపాట్లు జరిగితే విలువైన ప్రజా ధనం నష్టపోయే ప్రమాదం ఉందంటూ ప్రభుత్వానికి వ్రాసిన లేఖలో ఏపీ ట్రెజరీ సర్వీసెస్ అసోసియేషన్ పేర్కొంది .

Post a Comment

0Comments

Post a Comment (0)