రిటైర్మెంట్ వయసు పెంపు పై గవర్నర్ సంతకం

Telugu Lo Computer
0


ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపు ఫైల్ పై ఆ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ సంతకం చేశారు. ఇటీవలే వారి రిటైర్మెంట్ వయసు 60 సంవత్సరాల నుంచి 62 సంవత్సరాలకు పెంచుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గం తీర్మానం చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ ఫైలును గవర్నర్ బిశ్వభూషణ్ కు పంపగా ఈరోజు ఆమోదం లభించింది. జనవరి ఒకటో తేదీ నుంచి ఈ ఉత్తర్వులు అమలులోకి వస్తుంది. గవర్నర్ ఆమోదముద్ర కావడంతో దీనిపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ సాయంత్రం గెజిట్ విడుదల చేసే అవకాశం కూడా ఉంది. దీనిపై రిటైర్ కాబోయే ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా విడుదల చేసిన పిఆర్సి పై తీవ్ర గందరగోళం నెలకొన్న సంగతి తెలిసిందే. 

Post a Comment

0Comments

Post a Comment (0)