ప్రస్తుతం కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పలు రాష్ట్రాలలో నైట్ కర్ఫ్యూ విధించారు. అదే విధంగా మరికొన్ని చోట్ల వారాంతపు లాక్ డౌన్ కూడా అమలు చేశారు. బెంగుళూరులో కరోనా నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్న నేపథ్యంలో కొందరు బుల్లితెర నటులు మద్యం తాగుతూ చిందులు వేయడంతో పోలీసులు వారిపై కేసు నమోదు చేసిన ఘటన చోటుచేసుకుంది. బుల్లితెరపై పలు సీరియల్స్ లో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న రక్షిత్-అనూషా దంపతులతో పాటు అభిషేక్, రంజన్, రాకేశ్, రవిచంద్రన్‌లు వంటి తదితరులు అర్ధరాత్రి 1.30 సమయంలో ఫుల్లుగా మద్యం తాగి ఓ రిసార్ట్ లో చిందులు వేస్తూ ఉండగా పోలీసులు వీరిపై చర్యలు తీసుకున్నారు. ఈ క్రమంలోనే నటీనటులు పై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతోమంది స్పందిస్తూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎంతో మంది అభిమానులను సంపాదించుకుని ఎంతో మందికి ఇన్స్పిరేషన్ గా ఉండాల్సిన ఇలాంటి సెలబ్రెటీలు మద్యం మత్తులో ఏం చేస్తున్నారో కూడా తెలియకుండా ఇలా చిందులు వేయడం వల్ల ఎంతో మందికి ఇబ్బంది కలగడమే కాకుండా ప్రస్తుతం ఉన్న ఇలాంటి భయంకరమైన పరిస్థితులలో ఈ మహమ్మారి వ్యాప్తికి కారకులు అవుతారని సదరు నటీ నటులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కరోనా వ్యాప్తి చెంద కుండా ప్రభుత్వ అధికారులు నైట్ కర్ఫ్యూ విధించి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్న నేపథ్యంలో సెలబ్రిటీల మద్యం మత్తులో చిందులు వేయడంతో ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
మద్యం మత్తులో సీరియల్ నటుల చిందులు!
January 30, 2022
0
Tags