పాముకు ముద్దు పెడుతూ సెల్ఫీ !

Telugu Lo Computer
0


మహారాష్ట్ర ప్రాంతానికి చెందిన ఆకాష్ (30) కొంతకాలం కిందట హైదరాబాద్‌కు వలస వచ్చాడు. ప్రస్తుతం మేడ్చల్ జిల్లా గాజులరామారం పరిధిలోని కట్టమైసమ్మబస్తీలో భార్య, ఇద్దరు పిల్లలతో నివాసం ఉంటున్నాడు. అతడు రాళ్లు కొడుతూ జీవనం సాగిస్తున్నాడు. పాములు పట్టడం అతడికి వెన్నతో పెట్టిన విద్య. ఆదివారం సాయంత్రం జనావాసాల్లోకి వచ్చిన ఓ పామును ఆకాష్ పట్టుకున్నాడు. అంతటితో ఆగకుండా పాములో చెలగాటం ఆడాడు. పాముకు ముద్దులు పెడుతూ ఈ తతంగాన్ని సెల్ఫీలు, వీడియోలు తీసుకున్నాడు. సరదా కోసం ఓ వ్యక్తి చేసిన పని విషమంగా మారింది. చివరికి ఆసుపత్రిలో చేరి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. కొద్దిసేపు పాముతో ఆటల తరువాత విష సర్పాన్ని వదిలిపెట్టేశాడు. కానీ రాత్రి ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యాడు. సూరారంలోని మల్లారెడ్డి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పాము కాటు వేయడంతోనే అస్వస్థతకు గురైనట్లు, ప్రస్తుతం ఆకాష్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. అతడి శరీరం, ఉదరం నుంచి విషాన్ని తొలగించిన వైద్యులు అతడ్ని బతికించే ప్రయత్నం చేస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)