ఆంధ్రప్రదేశ్ లో మోగిన సమ్మె సైరన్!

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పీఆర్సీ స్ట్రగుల్ కమిటీ సమ్మె నోటీసు అందించింది. ఫిబ్రవరి 6 అర్ధరాత్రి నుంచి సమ్మెకు వెళుతున్నట్లు పేర్కొన్నారు. పీఆర్సీ సాధన సమితి పేరుతో 20 మంది స్టీరింగ్ కమిటీ సభ్యులు సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ) ముఖ్య కార్యదర్శికి సమ్మె నోటీసులు అందజేశారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల సంఘాల నుంచి పీఆర్సీ స్ట్రగుల్ కమిటీగా ఏర్పడినట్లు సమ్మె నోటీసులో పేర్కొన్నారు. పీఆర్సీ జీవోలను వెనక్కి తీసుకునే వరకూ సమ్మె కొనసాగుతుందని స్పష్టం చేశారు. పీఆర్సీకి సంబంధించి అధికారుల కమిటీ ఉద్యోగుల అభిప్రాయాలను, అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోకుండా జీవోలను జారీ చేశారని నోటీసుల్లో పేర్కొన్నారు. దీనివల్ల తీవ్రంగా నష్టపోతున్నామన్నారు. నిరసన కార్యక్రమాలను దిగుతున్నట్టు ప్రకటించారు. దీంతో ప్రభుత్వం చర్చల ద్వారా సమస్యను పరిష్కరిద్దామని చూసినా ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయింది. మంత్రుల కమిటీ సంధి కుదుర్చలేకపోయింది. ఇక ఏపీ హైకోర్టు పిలిచి ఉద్యోగ సంఘాల నేతలకు నచ్చజెప్పినా కూడా ఫలితం శూన్యంగా మారింది. 


Post a Comment

0Comments

Post a Comment (0)