నూతన జిల్లాల ఏర్పాటుపై వడివడిగా అడుగులు

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లో నూతన జిల్లాలకు సంబంధించి మరో రెండు రోజుల్లో నోటిఫికేషన్ రిలీజ్ కానున్నట్టు సమాచారం. ప్రతి లోక్ సభ నియోజక వర్గాన్ని ఒక జిల్లాగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. వైసీపీ మేనిఫెస్టోలో కూడా ఇదే హామీ ఇచ్చింది. జిల్లాల ప్రక్రియ ఇప్పటికే తుది దశకు చేరుకున్నట్టు సమాచారం. ఏపీలో మెత్తం 25 లోక్ సభ స్థానాలు ఉండగా, ఒక్క అరకు నియోజక వర్గాన్ని మాత్రం రెండు జిల్లాలుగా చేయనుంది ప్రభుత్వం. మొత్తం 13 జిల్లాలు ఇప్పుడు డబుల్ కానున్నాయి. ఏపీ ఇప్పుడు 26 జిల్లాలుగా మార్చనున్నారు. జనాభా పెరుగుదలను దృష్టిలో ఉంచుకుని పరిపాలనా సౌలభ్యం కోసం ఈ నిర్ణయం తీసుకోనున్నట్టు ప్రభుత్వం తెలిపింది. ఒక్క రాయల సీమనే 8 జిల్లాలుగా మార్చాలనే యోచనలో ప్రభుత్వం ఉంది. కర్నూల్, నంద్యాల, అనంతపురం, హిందూపురం, కడప, చిత్తూరు, తిరుపతి, రాజం పేట. నెల్లూరు, ఒంగోలు, బాపట్ల, నర్సరావుపేట, గుంటూరు, విజయవాడ, మచిలీపట్నం, నరసాపురం, అమలాపురం, రాజమండ్రి, ఏలూరు, కాకినాడ, అరకు(రెండు జిల్లాలు), శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం, అనకా పల్లి.

Post a Comment

0Comments

Post a Comment (0)