సదా కెరీర్ నాశనం అవ్వడానికి నిర్మాతే కారణమా?

Telugu Lo Computer
0



ప్రతి ఏడు చాలా మంది హీరోయిన్లు ఇండస్ట్రీకి వస్తుంటారు. అయితే కొందరు మాత్రమే సినీ పరిశ్రమలో కొనసాగుతారు. అయితే మంచి పేరు తెచ్చుకుని స్టార్ హీరోయిన్ హోదాను అందుకున్నప్పటికీ కొందరు హీరోయిన్లు వారు చేసే చిన్న పొరపాట్ల వలన కెరియర్ ని నాశనం చేసుకుని మధ్య లోనే ఇండస్ట్రీ నుండి వెనుతిరుగుతారు. అలాంటి వారిలో ఒకరు హీరోయిన్ సదా ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ప్రజల నీరాజనాలు అందుకున్న సదా సడెన్ గా సినీ పరిశ్రమలో కనుమరుగై పోయింది. అంత పెద్ద హీరోయిన్ సడెన్ గా సినిమాల్లో కనిపించకపోవడంతో అందుకు కారణాలు ఇవే అంటూ అప్పట్లో చాలా వార్తలే వినిపించాయి. టాలీవుడ్, కోలీవుడ్ లలో టాప్ హీరోయిన్ గా వరుస అవకాశాలతో దూసుకు వెళుతున్న సదా ఒక డైరెక్టర్ ప్రేమలో మునిగిపోయారు అంటూ ప్రచారం జరగడంతో ఆమెకు అవకాశాలు తగ్గాయని కొందరు అన్నారు. అంతే కాకుండా ఒక పెద్ద నిర్మాత సదాకు అడ్వాన్స్ ఇచ్చారు. అయితే కొన్ని కారణాల వలన ఆయన ఆ అడ్వాన్స్ తిరిగి ఇచ్చేయమని సదాపై ఒత్తిడి పెంచగా ఆమె ఆ నిర్మాత ఫోన్ లిఫ్ట్ చేయడం మానేశారట. అయితే విసుగు చెందిన ఆ నిర్మాత ఇండస్ట్రీ లోని కొందరు ప్రముఖుల చేత సదాను పిలిపించి ఇచ్చిన అడ్వాన్స్ వెనక్కి తీసుకున్నారట. దాంతో ఈ విషయం అందరికి తెలియడంతో అసలు పూర్తిగా సదాకు ఛాన్స్ లు ఇవ్వటం మానేశారట అలా ఇండస్ట్రీ నుండి పూర్తిగా సదా కనుమరుగైపోయారు అని అదే కారణమని టాక్. ప్రస్తుతం తన అమ్మను చూసుకుంటూ హ్యాపీగా ఉన్నారట. ఇలా ఎంతోమంది హీరోయిన్ లకు జరుగుతూ ఉంటుంది. కొందరికి బ్యాక్ గ్రౌండ్ ఉండడం వలన అన్ని పరిస్థితులను దాటుకుని ముందుకు వెళుతుంటారు. కానీ అతి కొద్ది మంది మాత్రమే సదా లాగా కెరీర్ ను నాశనం చేసుకుంటుంటారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)