హైదరాబాద్ కు చెందిన ఇద్దరు యువకులు నిన్న అర్ధరాత్రి సిటీ నుండి యాదగిరిగుట్టకు వెళ్తున్నారు. మార్గ మధ్యలో గూడూరు సమీపంలో అదే గ్రామానికి చెందిన మరో ఇద్దరు యువకులు హైవేపై ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా పెట్రోల్ అయిపోయింది. గూడూరు గ్రామ యువకులకు సహాయం కొరకు హైదరాబాద్ వాసులు వారి బైక్ నుండి పెట్రోలు తీసి ఇచ్చి వారికి సహాయం చేశారు. తమది గూడూరు అని, అక్కడికి వెళ్ళగానే పెట్రోలు పోయిస్తామని ఆ యువకులు చెప్పారు. అంతలోనే హైదరాబాద్ – గూడూరు యువకుల మధ్య వివాదం నెలకొంది. గూడూరు గ్రామానికి చెందిన మరో నలుగురిని రప్పించి సహాయం చేసిన హైదరాబాద్ చెందిన ఇద్దరు యువకులను చితకబాదారు. భయంతో హైదరాబాద్ యువకులు చెరోదిక్కు పరుగెత్తారు. వీరిలో ఒక యువకుడు చీకట్లో బావిలో పడిపోయాడు. మిగిలిన యువకుడి ఆచూకీ తెలుసుకుని పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. బావిలో నుంచి మృతదేహాన్నీ వెలికి తీసేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు.
చీకట్లో బావిలో పడి యువకుడి మృతి !
January 01, 2022
0
Tags