పీఆర్సీపై భగ్గుమన్న ఉద్యోగులు

Telugu Lo Computer
0


పీఆర్సీ అమలుపై ప్రభుత్వ ఉత్తర్వులకు వ్యతిరేకంగా ఆందోళన బాట పట్టేందుకు ఉద్యోగులు సిద్ధమవుతున్నారు. అవసరమైతే సమ్మె చేయాలనీ భావిస్తున్నారు. ఐకాసలు కార్యాచరణ ప్రకటించే వరకు నల్ల బ్యాడ్జీలతో విధుల్లో పాల్గొనాలని నిర్ణయించారు. పలుచోట్ల ఉపాధ్యాయులు ర్యాలీలు, ఆందోళనలు, ధర్నాలు నిర్వహించారు. జీవోల ప్రతులను దహనం చేశారు. మధ్యాహ్న భోజన విరామ సమయంలో పీఆర్సీకి వ్యతిరేకంగా నినాదాలు చేసి, నిరసన తెలిపారు. ఏపీ ఉపాధ్యాయుల సమాఖ్య (ఫ్యాప్టో) ఇచ్చిన పిలుపు మేరకు ఉత్తర్వుల ప్రతులను మంటల్లో దహనం చేశారు. 20న కలెక్టరేట్ల ముట్టడి, 28న చలో విజయవాడలకు ఫ్యాప్టో పిలుపునిచ్చింది. కర్నూలు కలెక్టరేట్‌ ముందు ఉద్యోగులు ఆందోళన నిర్వహించారు. జీవోల ప్రతులను దహనం చేశారు. నల్ల బ్యాడ్జీలతో కార్యాలయాలకు హాజరయ్యారు. అనంతపురం, కడప, చిత్తూరు జిల్లాల్లో ఉద్యోగులు, ఉపాధ్యాయులు నల్లబ్యాడ్జీలు ధరించి భోజన విరామ సమయంలో పీఆర్సీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సాయంత్రం ఉత్తర్వుల ప్రతులను తగలబెట్టారు. నెల్లూరు జిల్లాలో ఉపాధ్యాయులు, ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరయ్యారు. ఎంఈవో కార్యాలయాలు, కూడళ్లలో ఉపాధ్యాయులు ఉత్తర్వుల ప్రతులను మంటల్లో తగలబెట్టారు. రద్దు చేసిన భత్యాలను పునరుద్ధరించాలని డిమాండు చేశారు. గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో ఉపాధ్యాయులు, ఉద్యోగులు ఆందోళనలు నిర్వహించారు. అర్ధరాత్రి ఉత్తర్వులు ఇచ్చారని, వీటిని అంగీకరించబోమని ప్రకటించారు. నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరై, ఉత్తర్వుల ప్రతులను తగలబెట్టారు. కృష్ణాజిల్లాలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసనను తెలియజేశారు. పలు మండలాల్లో ర్యాలీలు నిర్వహించారు. సాయంత్రం ఉత్తర్వుల ప్రతులను తగలబెట్టారు. విజయవాడ మున్సిపల్‌ ఉపాధ్యాయ ఐకాస ఆధ్వర్యంలో ధర్నాచౌక్‌లో జీవోలను దహనం చేశారు. నందిగామ, జగ్గయ్యపేటల్లో భారీగా నిరసన ప్రదర్శన చేపట్టారు. ఉపాధ్యాయ నిరసనకు మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మద్దతు పలికారు.

Post a Comment

0Comments

Post a Comment (0)