క్యాసినోల నిర్వహణపై విచారణకు ఆదేశాలు

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లో సంక్రాంతి సమయంలో కృష్ణా జిల్లా గుడివాడలో క్యాసినోలు నిర్వహించటంపై చర్యలు తీసుకోవాలని తెదేపా నేతలు ఇచ్చిన ఫిర్యాదుపై జిల్లా ఎస్పీ సిద్దార్థ్‌ కౌశల్ స్పందించారు. సంఘటనపై విచారణ చేపట్టాలని నూజివీడు డీఎస్పీ శ్రీనివాసులును ఆదేశించారు. దీంతో ప్రత్యేక బృందంతో నూజివీడు డీఎస్పీ విచారణ ప్రారంభించనున్నారు. క్యాసినోల నిర్వహణపై స్థానిక పోలీసులు ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు చేపట్టారో పూర్తి వివరాలు సేకరించి ఆ నివేదికను ఎస్పీకి సమర్పించనున్నారు. గుడివాడను అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా చేస్తున్నారని, పండగ ముసుగులో క్యాసినోలు నిర్వహించారని ఆరోపిస్తూ తెదేపా నేతలు వర్ల రామయ్య, కొల్లు రవీంద్ర, కొనకళ్ల నారాయణ, బోండా ఉమ, గద్దె రామ్మోహన్‌ తదితరులు ఎస్పీకి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. 

Post a Comment

0Comments

Post a Comment (0)