ఆంధ్రప్రదేశ్ లోని విశాఖ నగరంలో డ్రగ్స్ కలకలం రేపింది. తన లవర్ కోసం మత్తు పదార్ధాలు అక్రమంగా రవాణా చేస్తూ ఓ యువతి అడ్డంగా బుక్కైంది… టాబ్లెట్ రూపంలో ఉన్న 18 పిల్స్, 2ఎండీఏంఏలను ఆ యువతి నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ నుంచి వస్తున్న యువతి దగ్గర డ్రగ్స్ ఉన్నట్టు టాస్క్ ఫోర్స్ కు పక్కా సమాచారం అందింది. ఈ నేపథ్యంలోనే మర్రిపాలెం గ్రీన్ గార్డెన్స్ ఏరియాకు చెందిన యువకుడు, హైదరాబాద్ యువతిని అరెస్ట్ చేశారు. డ్రగ్స్ అలవాటుపడ్డంతో ప్రియుడి కోసం హైదరాబాద్ నుంచి తీసుకుని వచ్చింది ఆ యువతి. పక్క సమాచారంతో ఉన్న పోలీసులు.. ఆ యువతి దగ్గర ఉన్న డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు.
ప్రియుడి కోసం డ్రగ్స్ తీసుకెళ్తున్నయువతి అరెస్ట్
January 31, 2022
0
Tags