నాడు తెలంగాణలో . నేడు ఏపీలో ...!

Telugu Lo Computer
0

 


రెండు తెలుగు రాష్ట్రాల్లో 73వ రిపబ్లిక్ డే ఉత్సవాలు ఘనంగా జరిగాయి. అయితే ఏపీలో ఓ ఆశ్చర్యకర ఘటన చోటుచేసుకుంది. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ మైదానంలో ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో సీఎం జగన్, ఐఏఎస్ అధికారులు పాల్గొన్నారు. రిపబ్లిక్ డే సందర్భంగా జాతీయ జెండా ఎగురవేసిన అనంతరం ఐఏఎస్ అధికారులతో సీఎం జగన్ ముచ్చటించారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ పిలవగానే వచ్చిన సీఎం ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాష్‌ మోకాళ్లపై కూర్చుని ఆయనతో మాట్లాడారు. దీనికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు సెటరికల్ గా కామెంట్లు చేస్తున్నారు. గతంలో తెలంగాణలోనూ ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. గతంలో మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డి సీఎం కేసీఆర్ కాళ్లపై పడగా అప్పుడు ఆ ఘటన సంచలనంగా మారింది. తాజాగా ఏపీలో జరిగిన ఘటనపైనా పలు రకాల కామెంట్లు వినిపిస్తున్నాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)