సౌతాఫ్రికా 3-0తో సిరీస్ కైవసం

Telugu Lo Computer
0


మూడో వన్డేలోనూ భారత్ ఓటమి పాలైంది. దీంతో సౌతాఫ్రికా మూడు వన్డేల సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేశారు. సఫారీల గడ్డపై భారత బౌలర్లు, బ్యాట్స్‌మెన్లు సమష్టిగా వైఫల్యం చెందారు. సౌతాఫ్రికా నిర్దేశించిన 288 పరుగుల భారీ విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా 49.2 ఓవర్లలో 283 పరుగులు చేసి ఓటమిపాలైయింది. భారత బ్యాట్స్‌మెన్‌లో విరాట్ కోహ్లీ 65, ధావన్ 61, దీపక్ చాహర్ 54, సూర్యకుమార్ 39, శ్రేయస్ అయ్యర్ 26 తప్ప మరెవరూ రాణించలేక పోయారు. సౌతాఫ్రికా బౌలర్లలో ఎంగిడి, ఆండిల్ మూడేసి వికెట్లు తీసుకున్నారు. అంతకు ముందు బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 49.5 ఓవర్లలో 287 పరుగులకు ఆలౌటైంది. సఫారీ జట్టులో డికాక్ 124 పరుగులు చేసి భారత బౌలర్ల నడ్డి విడిచాడు. భారత బౌలర్లలో ప్రసిధ్ 3, చాహర్, బుమ్రా రెండేసి వికెట్లు తీశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)