ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా 14,502 మందికి కరోనా

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 40,266 నమూనాలు పరీక్షించగా,  కొత్తగా 14,502 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ సోకి పశ్చిమగోదావరి జిల్లాలో ఇద్దరు మరణించగా.. గుంటూరు, కర్నూలు, నెల్లూరు, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతిచెందారు. కరోనా బారి నుంచి తాజాగా 4,800 మంది పూర్తిగా కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 93,305 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులిటెన్‌లో తెలిపింది. అత్యధికంగా విశాఖ జిల్లాలో 1,728 కేసులు నమోదయ్యాయి. కరోనాతో పోరాడుతూ ఇప్పటి వరకూ 14,549 మంది మృతి చెందారు.

Post a Comment

0Comments

Post a Comment (0)