ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా థర్డ్ క్రమ క్రమంగా విజృంభిస్తోంది. రోజుకు పది వేలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా 12,615 కేసులు నమోదు అయ్యాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం. రాష్ట్రవ్యాప్తంగా గడిచిన 24 గంటల లో కొత్తగా 12615 కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీంతో ఆంధ్ర ప్రదేశ్ లో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2140056 కి పెరిగింది. కోవిడ్ వల్ల విశాఖపట్నం లో ముగ్గురు,చిత్తూరు మరియు నెల్లూరులలో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. దీంతో కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 14527 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 53871 యాక్టివ్ కరోనా కేసులు ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో 3,674 మంది బాధితులు కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఇక ఇప్పటి దాకా కరోనా బారిన పడి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 2071658 లక్షలకు చేరింది. ఇక నిన్న ఒక్క రోజే ఏపీలో 47,420 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా ఇప్పటి దాకా 3,20,12,102 కరోనా పరీక్షలు చేసినట్టు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.
ఆంధ్రప్రదేశ్ లో ఒక్కరోజే 12,615 కేసులు నమోదు
January 20, 2022
0