తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన కల్పలత ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు. బన్నీ తనతో అమ్మా! నీ ఏజ్ ఎంత అని అడిగారని ఆ ప్రశ్నకు తాను షాక్ కావడంతో పాటు అల్లు అర్జున్ తనను ఇలా అడిగాడు ఏమిటని అనుకున్నానని ఆమె తెలిపారు. ఆ తర్వాత బన్నీ కంగారు పడవద్దని చెప్పగా తాను తన వయస్సు 42 సంవత్సరాలు అని చెప్పానని కల్పలత పేర్కొన్నారు. తన వయస్సు విని బన్నీ ఆశ్చర్యపోవడంతో పాటు ఎంతమంది పిల్లలు అని అడిగారని కల్పలత చెప్పుకొచ్చారు. పిల్లలు ఏం చదువుతున్నారని బన్నీ అడగగా ఉద్యోగాలు చేస్తున్నారని తాను చెప్పడంతో షాకయ్యారని కల్పలత చెప్పుకొచ్చారు. బన్నీ ఎక్స్ ప్రెషన్లు ఒక్కసారిగా మారిపోయాయని ఆ తర్వాత ఏ వయస్సులో పెళ్లి చేసుకున్నారని బన్నీ అడగగా తాను 14 సంవత్సరాల వయస్సులో పెళ్లి అయిందని చెప్పానని కల్పలత అన్నారు. ఆ తర్వాత బన్నీ నాకు నీకు రెండు సంవత్సరాలు మాత్రమే తేడా అని చెప్పారని కల్పలత చెప్పుకొచ్చారు. వయస్సులో బన్నీ తనకంటే పెద్ద వ్యక్తి కాకపోయినా అనుభవంలో మాత్రం పెద్ద వ్యక్తి అని కల్పలత వెల్లడించారు. బన్నీ సుకుమార్ తో మా అమ్మకు నాకు రెండు సంవత్సరాలు మాత్రమే తేడా అని చెప్పారని సుకుమార్ నన్నేం చేయమంటావ్ అని సరదాగా అన్నారని కల్పలత పేర్కొన్నారు.
మా అమ్మకు నాకు రెండు సంవత్సరాలే తేడా!
December 31, 2021
0