నగ్నంగా కిందపడిన యువతి !

Telugu Lo Computer
0


పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఓ యువతి తన ప్రియుడి కోసం గతంలో ఇంటిని విడిచి పెట్టి వెళ్లిపోయింది. అనంతరం వారిద్దరు పానీపట్ లో వివాహం చేసుకున్నారు. ఆ బంధం ఎక్కువ కాలం నిలవలేదు. పలు కారణాల వల్ల వారు విడిపోయారు. ఆ తర్వాత ఆ యువతి పానీపట్ లోని ఓ షాపింగ్‌ మాల్‌లో పనిచేయడం మొదలుపెట్టింది. ఈ సమయంలోనే గ్రేటర్‌ నోయిడాలోని ఓ ఎన్‌ఆర్‌ఐ సొసైటీకి చెందిన కెమికల్‌ ఇంజినీర్‌ నితిన్‌ గుప్తాతో ఆమెకు పరిచయమైంది. ఈ నెల 12న ఉదయం.. నితిన్‌ గుప్తా నివాసం కింద ఆ యువతి నగ్నంగా పడి ఉండడం స్థానికంగా కలకలం రేపింది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు. నితిన్‌ గుప్తాను విచారించారు. ''కొవిడ్‌ కారణంగా నా భార్య గతేడాది మరణించింది. అప్పుడే ఆ యువతితో నాకు పరిచయం ఏర్పడింది. తరచూ కలుస్తూ ఉండేవాళ్లం. ఆ రోజు తను నా ఇంటికి వచ్చింది. ఇద్దరం భోజనం చేసి పడుకున్నాం. ఉదయం ఆరు గంటల సమయంలో తను లేచి స్నానాల గదికి వెళ్లింది. అనంతరం కింద పడిపోయింది. నా ఇల్లు 7వ అంతస్తులో ఉంది'' అని నితిన్‌ పోలీసులకు చెప్పాడు. ప్రస్తుతం యువతి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.


Advertisement


Post a Comment

0Comments

Post a Comment (0)