ప్రొ కబడ్డీ సీజన్-8లో బెంగళూరు బుల్స్ తొలి విజయాన్ని నమోదు చేసింది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు 38-30తో తమిళ్ తలైవా్‌సను ఓడించింది. ఓ దశలో తలైవాస్ ఆధిక్యం కనబర్చినా.. బుల్స్ పోరాడి మ్యాచ్‌లోకి వచ్చింది. బెంగళూరు కెప్టెన్ పవన్ కుమార్ షెహ్రావత్ 9 పాయింట్లు, చంద్రన్ రంజిత్ 7 పాయింట్లు తీసుకొచ్చారు. డిఫెండర్ సౌరభ్ నండల్ హైఫైవ్‌తో రాణించాడు. తలైవాస్ రైడర్ భవానీ రాజ్‌పుత్ 8 పాయింట్లు పట్టుకురాగా.. డిఫెండర్ సాగర్ హైఫైవ్ సాధించాడు. ఆరంభంలో ఇరుజట్లూ నువ్వానేనా అన్నట్టు తలపడినా.. నెమ్మదిగా ఆధిక్యాన్ని పెంచిన బుల్స్ ముందంజ వేసింది. 15వ నిమిషంలో 11-9తో పైచేయి సాధించిన బెంగళూరు 19-13తో ఫస్టా్‌ఫను ముగించింది. కానీ, సెకండాఫ్ మొదలైన నాలుగో నిమిషంలోనే బుల్స్‌ను ఆలౌట్ చేసిన తలైవాస్ 21-19తో ఆధిక్యం సాధించింది. అయితే, మంజీత్‌ను పట్టేసిన బుల్స్.. పవన్‌ను రివైవ్ చేసుకోవడంతో 21-22తో పోటీలో కొచ్చింది. 25-25 వద్ద స్కోర్లు సమం చేసిన బుల్స్.. ఇక్కడి నుంచి ఆధిక్యాన్ని కాపాడుకుంటూ మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. నవీన్ ఎక్స్‌ప్రెస్ మరోసారి దడదడలాడించడంతో.. ఢిల్లీ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో ఢిల్లీ 31-27తో యు ముంబాపై గెలిచింది. ఒక దశలో 9 పాయింట్ల ఆధిక్యంలో నిలిచిన ముంబా.. అనవసర తప్పిదాలతో మ్యాచ్‌ను చేజార్చుకొంది. మొత్తం 17 పాయింట్లతో మరోసారి సూపర్-10 సాధించిన నవీన్.. లీగ్‌లో వేగంగా 500 పాయింట్ల (47 మ్యాచ్‌ల్లో) మైలురాయిని చేరిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ముంబా తరఫున అజిత్ 7 పాయింట్లు, అభిషేక్ 5 పాయింట్లు సాధించారు. రైడింగ్‌లో ఇరు జట్లూ సమవుజ్జీలుగానే కనిపించినా.. టాకిలింగ్స్‌లో ఢిల్లీది పైచేయిగా నిలవడం విశేషం. ఫస్టా్‌ఫలో ఇరుజట్లూ రక్షణాత్మక ఆటను ప్రదర్శించడంతో.. పాయింట్ల రాక నెమ్మదిగా సాగింది. కానీ, 20వ నిమిషంలో సూపర్ టాకిల్ చేసిన ముంబా 12-10తో ఆధిక్యంలో నిలిచింది. ఇక సెకండాఫ్ ఆరంభంలోనే నవీన్‌ను పట్టేసిన ముంబా ఒక్కసారిగా జోరు పెంచింది. 24వ నిమిషంలో డూ ఆర్ డై రైడ్‌కు వెళ్లిన అభిషేక్.. ఢిల్లీని ఆలౌట్ చేయడంతో ముంబా 19-10తో భారీ ఆధిక్యం సాధించింది. కానీ, నవీన్ విజృంభించి వరుసగా పాయింట్లు రాబడుతూ 23-24తో ఢిల్లీని మ్యాచ్‌లోకి తెచ్చాడు. 38వ నిమిషంలో నవీన్ సూపర్ రైడ్‌తో 29-24తో పైచేయి సాధించిన ఢిల్లీ.. ప్రత్యర్థికి మరో అవకాశం ఇవ్వకుండా విజయం అందుకుంది. మూడో మ్యాచ్‌లో బెంగాల్ వారియర్స్ 31-28తో గుజరాత్ జెయింట్స్‌పై నెగ్గింది.
ప్రొ కబడ్డీ సీజన్-8 ప్రారంభం
December 25, 2021
0
Tags