సంక్లిష్టమైన సంవత్సరం : సమంత

Telugu Lo Computer
0


చైతు - సమంత విడిపోవడం ఇప్పటికీ తెలుగు సినిమా అభిమానులు జీర్ణించుకోలేని పరిస్థితి ఉంది. విడాకుల తర్వాత సమంత ఎన్టీఆర్ హోస్ట్ చేసిన ఎవరు మీలో కోటీశ్వరుడు కార్యక్రమానికి కూడా వచ్చింది. ఆ షోలో సమంతను చూసిన వారు ఆమె చాలా కలత చెందినట్లు ఉందని చర్చించుకున్నారు. సమంతలో మునుపటి జోస్ అయితే ఉన్నట్టు లేదు. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో 2021 సంవత్సరం తనకు ఎంతో శాడ్‌ ఇయర్ అని చెప్పింది. ఈ ఇంటర్వ్యూలో 2021 ఎలా గడిచిందో ఒక్క మాటలో చెప్పాలంటే సమంత మాత్రం ఈ సంవత్సరం తనకు సంక్లిష్టమైన సంవత్సరం అని చెప్పింది. సౌత్ ఇండియా స్టార్స్ అందరూ కలిసి పాల్గొన్న ఈ ఇంటర్వ్యూ ఫుల్ వీడియో డిసెంబర్ 6న టెలీకాస్ట్ చేయనున్నారు. విడాకుల తర్వాత ఆ బాధ నుంచి బయటకు వచ్చేందుకు సమంత వరుసగా సినిమాలకు గ్రీన్‌సిగ్నల్ ఇస్తూ వస్తున్నారు. ఆమె ఓ హాలీవుడ్ సినిమాకు సైతం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. తెలుగులో గుణశేఖర్ దర్శకత్వంలో ఆమె నటించిన శాకుంతలం సినిమా కూడా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది

Post a Comment

0Comments

Post a Comment (0)