సంధ్యా కన్వెన్షన్ ఎండీ శ్రీధర్ రావు అరెస్ట్

Telugu Lo Computer
0


హైదరాబాద్‌ లోని సంధ్యా కన్వెన్షన్ ఎండీ శ్రీధర్ రావును అరెస్ట్ చేశారు. భవన నిర్మాణ విషయంలో అనేక మందిని మోసం చేసిన వ్యవహారంలో రాయదుర్గం పోలీసులు అరెస్ట్ చేశారు. బెంగళూరులో నిన్న అరెస్ట్ చేసి హైదరాబాద్‌ కు తీసుకొచ్చిన పోలీసులు తెల్లవారుజామున జడ్జి ముందు హాజరుపరిచారు. అనంతరం శ్రీధర్‌రావుకు 14 రోజుల రిమాండ్ విధించారు. అయితే ఇటీవల శ్రీధర్ రావు అరెస్ట్‌ని ఉప్పరపల్లి కోర్టు తప్పుబట్టింది. 41 సి ఆర్ సి పి కింద నోటీసులు ఇవ్వకుండా ఎలా అరెస్టు చేశారంటూ శ్రీధరరావు తరపు న్యాయవాదులు కోర్టులో వాదించారు. నోటీసు ఇచ్చిన తర్వాత చర్యలు చేపట్టాలని కోర్టు ఆదేశించింది. తాజాగా శ్రీధర్ రావుకు నోటీసు ఇచ్చిన రాయదుర్గం పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు.


Post a Comment

0Comments

Post a Comment (0)