తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఆదివారం తిరుమల శ్రీవారిని 34,824 మంది భక్తులు దర్శించుకున్నారు. ఈ క్రమంలో వారు శ్రీవారికి ప్రత్యేక పూజలు చేసి, మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారికి 15,650 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీకి 3.19 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని టిటిడి అధికారులు తెలిపారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, కరోనా నిబంధనలు పాటిస్తూ ఆలయంలో అన్ని ఏర్పాట్లు చేసినట్టు వారు వెల్లడించారు. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు విధిగా కరోనా నెగిటివ్ సర్టిపికెట్ తో రావాలని టిటిడి అధికారులు కోరారు.
తిరుమల ఆలయంలో భక్తుల రద్దీ
November 08, 2021
0