సెల్ఫీ ఇవ్వలేదని విజయ్ ని తన్నాడా ?

Telugu Lo Computer
0


తమిళ సూపర్‌ స్టార్‌ విజరుసేతుపతిని ఓ అగంతకుడు బెంగళూరు ఎయిర్‌పోర్టులో ఎగిరి తన్నాడు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే.  అసలెందుకు ఆ వ్యక్తి విజరుసేతుపతిపై దాడి చేశాడు అనే దానిపై రకరకాల వార్తలు తెరపైకి వచ్చాయి. మొదట కన్నడ పవర్‌స్టార్‌ పునీత్‌ రాజ్‌కుమార్‌ అంత్యక్రియలకు విజరు హాజరు కాకపోవడంతో ఓ కన్నడిగుడు ఆగ్రహంతో  అతనిపై దాడి చేశాడు అనే వార్తలొచ్చాయి. తాజాగా మరో కారణం తెరపైకి వచ్చింది. విజరుసేతుపతి అభిమాని అయిన జాన్సన్‌కు ఎయిర్‌పోర్ట్‌లో విజరు కనిపించగానే.. సెల్ఫీ కోసం ప్రయత్నించాడట. అయితే ఆ సమయంలో ఆయన అసిస్టెంట్లు అతన్ని అడ్డుకున్నారు. ఆ కోపంలో తాగిన మైకంలో ఉన్న జాన్సన్‌  ఆవేశంతో విజరును తన్నాడు. అయితే ఆ సమయంలో విజరు తనని కోప్పడకుండా.. మౌనంగా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. జాన్సన్‌ను సహాయక సిబ్బంది పట్టుకోగా.. అతను విజరుసేతుపతికి క్షమాపణలు చెప్పినట్లు సమాచారం

Post a Comment

0Comments

Post a Comment (0)