రెండు వారాల తర్వాత కోమా నుంచి తిరిగొచ్చిన యువతి

Telugu Lo Computer
0


అమెరికాలోని కాలిఫోర్నియా లాస్ ఏంజెల్స్‌లో నివాసముంటున్న సమర్ డియాజ్ (24) గతేడాది నవంబర్‌లో ఘోర రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఆమెకు తీవ్ర గాయాలు కావడంతో కోమాలోకి వెళ్లిపోయింది. దాదాపు రెండు వారాల నిరీక్షణ అనంతరం ఆమె తిరిగి స్పృహలోకి వచ్చింది. ఇక స్పృహలోకి వచ్చిన సమర్ వేరే భాషను మాట్లాడుంటే.. డాక్టర్లకు డౌట్ వచ్చి.. ”మీరు ఏ దేశానికి చెందిన పౌరులని ” ఆమెను అడిగారు. తాను అమెరికాలోని కాలిఫోర్నియా నివాసినని సమర్ చెప్పడంతో వైద్యులు ఒక్కసారిగా ఖంగుతిన్నారు. కోమా నుంచి తిరిగొచ్చిన సమర్ తన మాతృభాషను మర్చిపోయి న్యూజిలాండ్ భాషలో మాట్లాడటం మొదలు పెట్టింది. దీనితో డాక్టర్లు, అక్కడ పని చేసే వైద్య సిబ్బందితో పాటు సమర్ సన్నిహితులు కూడా షాక్ అయ్యారు. అయితే డాక్టర్లు మాత్రం ఖంగారు పడాల్సిన అవసరం లేదని.. సమర్ ‘ఫారెన్ యాక్సెంట్ సిండ్రోమ్’ అనే డీసీజ్‌తో బాధపడుతోందని వివరించారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Post a Comment

0Comments

Post a Comment (0)