28 నుంచి ప్లిఫ్‌కార్ట్ బిగ్ దివాళి సేల్

Telugu Lo Computer
0


ఈకామర్స్ దిగ్గజం ప్లిఫ్‌కార్ట్ ఈనెల 28 నుంచి బిగ్ దివాళి సేల్‌ను కస్టమర్లకు అందించనుంది. ఈ సేల్ 28న ప్రారంభమై నవంబర్ 3వరకూ కొనసాగనుంది. ఎస్‌బీఐ డెబిట్ కార్డుతో కొనుగోళ్లు జరిపే కస్టమర్లకు ఆయా వస్తువులపై పది శాతం డిస్కౌంట్ లబిస్తుంది. ప్రొడక్ట్స్‌పై భారీ డిస్కాంట్లు ఆఫర్ చేయనున్నట్టు ప్లిఫ్‌కార్ట్ టీజ్ చేస్తోంది. డెస్క్‌టాప్‌లు, పవర్ బ్యాంక్స్‌, హెడ్‌ఫోన్స్‌, స్పీకర్స్ సహా పలు ఉత్పత్తులపై 80 శాతం వరకూ దివాళీ సేల్‌లో ఆఫర్స్ అందుబాటులో ఉంటాయి. టీవీలు, అప్లయన్సెస్‌పై 75 శాతం వరకూ ఆఫర్లు ఉంటాని ఆన్‌లైన్ రిటైలర్ కస్టమర్లను ఊరిస్తోంది. బిగ్ దివాళి సేల్ సందర్భంగా రూ 60,000 నుంచి రూ 66,199 వరకూ పలికే ఐఫోన్ 12, రూ 45,199 నుంచి అందుబాటులో ఉండే ఐఫోన్ 12 మినీపై భారీ డిస్కౌంట్లను ప్లిఫకార్ట్ ఆఫర్ చేయవచ్చని భావిస్తున్నారు. ఇక రెడ్‌మి9 ప్రైమ్‌, రెడ్‌మి 9ఐ స్పోర్ట్‌, రెడ్‌మి పవర్‌, రెడ్‌మి8ఏ డ్యూయల్‌, రెడ్‌మి నోట్ 9 వంటి షియోమి ఫోన్లపై భారీ డిసౌంట్లు అందుబాటులో ఉండనున్నాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)