తెలంగాణ రాష్ట్రం లోని సిద్దిపేట జిల్లాలోని కొండపాక తహసీల్దార్ కార్యాలయానికి ఓ మహిళా రైతు నిప్పు పెట్టేందుకు యత్నించిన ఘటన కలకలం రేపింది. తన పట్టా భూములను ఇతరుల పేర మార్చారని లక్ష్మీ అనే మహిళా రైతు గత కొంతకాలంగా తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. అధికారుల చుట్టూ తిరిగినా పట్టించుకోవట్లేదని ఆవేదనకు గురైన లక్ష్మి బుధవారం మధ్యాహ్నం తహసీల్దార్ కార్యాలయంలో పెట్రోల్ పోసి నిప్పంటించేందుకు యత్నించారు. తహసీల్దార్ కార్యాలయంలో పెట్రోల్ పోసిన మహిళ