హైదరాబాద్ లో ఓ యువకుడు రాత్రిపూట నగ్నంగా తన ఇంటి పక్కింట్లోకి వెళ్లడం కలకలం సృష్టించింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం. నేరేడ్‌మెట్ పరిధిలోని సంతోష్ నగర్ కాలనీలో నివసిస్తున్న ఓ 18 ఏండ్ల యువకుడు శనివారం రాత్రి తన ఒంటిమీద నూలుపోగు కూడా లేకుండా పక్కింట్లోకి వెళ్లాడు. అక్కడినుంచి ఆ యువకుడు కిటికీలోంచి తొంగి చూశాడు. ఇది గమనించిన పక్కింటివారు ఆ యువకుడిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. అయితే యువకుడు తప్పించుకుని పారిపోయాడు. దాంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ప్రస్తుతం ఆ యువకుడి కోసం గాలిస్తున్నారు.
నగ్నంగా పక్కింట్లోకి దూరిన యువకుడు
September 26, 2021
0