అత్యుత్తమ సౌందర్య సాధనాలు.!
* పెదవులకు - సత్యం
* కన్నులకు - దయ
* చేతులకు - దానం.
* ముఖానికి - చిరునవ్వు
* హృదయానికి - ప్రేమ.
వీటి ద్వారా జీవితాన్ని అందంగా, ఆనందంగా మలచుకొందాం.!
జీవన ధర్మాలు.!
* ప్రార్థించే ముందు విశ్వసించాలి.
* మాట్లాడే ముందు వినాలి.
* ఖర్చు చేసే ముందు సంపాదించాలి
* ప్రతిస్పందించే ముందు ఆలోచించాలి.
* విమర్శించే ముందు వేచి వుండాలి.
* ఓడిపోయే ముందు ప్రయత్నించాలి.
* మరణించే ముందు జీవించాలి.!