ప్రముఖ నటుడు, డీఎండీకే అధ్యక్షుడు విజయ్ కాంత్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. గత కొద్ది రోజులుగా ఆయన తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. కొద్ది రోజుల క్రితం సింగపూర్, అమెరికాలో ఆయన చికిత్స చేయించుకుని వచ్చారు. తాజాగా ఆయన తానుగా లేచి నిలబడే శక్తిని కోల్పోయి బాధపడుతున్నట్లుగా తెలుస్తోంది. మెరుగైన చికిత్స కోసం విజయ కాంత్ ను ఆయన కుమారుడు దుబాయ్ కి తీసుకెళ్లినట్లుగా తెలుస్తోంది. విజయ్ కాంత్ ఆరోగ్య పరిస్థితి కాస్త విషమంగా మారినట్లుగా సమాచారం.
విజయ్ కాంత్ ఆరోగ్య పరిస్థితి విషమం
August 31, 2021
0