వెల్లులితో కంట్రోల్ లో షుగర్

Telugu Lo Computer
0


షుగర్ వ్యాధితో బాధపడుతున్న వారికి వెల్లుల్లి చాలా మేలు చేస్తుంది. కేవలం షుగర్ మాత్రమే కాదు అనేక  వ్యాధులు కూడా వెల్లుల్లి వల్ల దరి చేరకుండా ఉంటాయి. దీనిని రోజూ ఆహారంలో భాగంగా చేర్చుకోవడం వల్ల అనేక వ్యాధుల నుండి మనల్ని రక్షించడమే కాకుండా రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. ఇది డయాబెటిక్ రోగులకు ప్రత్యేకంగా ఉపయోగపడుతుంది. మన దేశంలో లక్షలాది మంది మధుమేహంతో బాధపడుతున్నారు. డయాబెటిస్ అనేది ఒక రకమైన జీవక్రియ రుగ్మత. ఇది శరీరంలో ఇన్సులిన్ లేకపోవడం వల్ల సంభవిస్తుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు వారి ఆహారంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఎందుకంటే ఆహారం, పానీయం కారణంగా రక్తంలో చక్కెర శాతం తగ్గుతుంది. దీంతో షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. వెల్లుల్లి ఔషధ గుణాలతో సమృద్ధిగా ఉంటుంది. వెల్లుల్లిలో ఉండే పోషకాలు శరీరాన్ని డిటాక్సిఫై చేయడంలో సహాయపడతాయి. వెల్లుల్లిలో ఉండే అమైనో ఆమ్లం హోమోసిస్టీన్ మొత్తాన్ని తగ్గించడంలో ,మంచి ఎఫెక్ట్ చూపిస్తుంది. ఇది రక్తంలో ఉండే చక్కెరను నియంత్రిస్తుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)