నీళ్ళు మారితే వచ్చిందని, ఊరు మారితే వచ్చిందని కొందరు వాటిపై నిందలు వేస్తూ ఉంటారు తప్ప వారిపై వారు ఎప్పుడూ వేసుకోరు. తప్పు మనలో పెట్టుకున్నంత కాలo నీరు త్రాగినా అమీబియాసిస్ పోదు. జంతువులు ఏ నీరు పడితే ఆ కాలం
నీరును, పచ్చటి నీటిని త్రాగినా వాటికి అమీబియాసిస్, నులిపురుగులు లాంటివిరావు క్రిముల నుండి రక్షించే శక్తి, చంపేశక్తి వాటి ప్రేగులలోబలంగా ఉంది మన కు ఆ శక్తి తప్ప అన్నీ ఉంటాయి. విరేచన బద్దకం ఉన్నవారికి ఈ సమస్య ఎక్కువగా వస్తుంది. నిల్వ ఉన్న మలంలో అనేక రకాల క్రిములు పుట్టి ప్రేగుల ఆరోగ్యాన్ని పాడుచేస్తాయి. ఆ చెడ్డక్రిములు పెరగడం వల్ల ప్రేగులలో నుంచి క్రిములు తగ్గిపోతాయి. ఎవరి ప్రేగులలో రక్షించే సూక్ష్మ జీవులు తగ్గిపోతాయో. వాళ్ళ ప్రేగులలో అమీబాలు గోడలకు పేరుకుని పిల్లలను అభివృద్ధి చేస్తూ ఉంటాయి
చిట్కాలు
1) రెండు, మూడు రోజులు పాటు ఉదయం పూట గోరువెచ్చని నీటితో ఎనిమా చేసుకోవాలి.
2) ఆ తరువాత ఒక రోజు ఆ గోరువెచ్చని నీటిలో నిమ్మరసాన్ని (ఒక పెద్దకాయను గింజలు, తుక్కుపడకుండా) పిండి ఆ నీటితో ఎనిమా చేసుకోవాలి.
3) ఎనిమా నీటిని ఒక డబ్బా ఎక్కిస్తే చాలవు. కాబట్టి ప్రేగుల అంచులను క్లీన్ చేయాలంటే ప్రతిరోజూ ఒక డబ్బా | ఎక్కాక మరలా వెంటనే ఇంకొక డబ్బా నీరు కూడా ఎక్కించగలిగితే మంచిది.
4) నాల్గవ రోజు నుండి, ఎనిమా డబ్బాలో వేపాకు నీటిని పోసి (దోసెడు వేప ఆకును 2 లీ॥ నీటిలో వేసి మరిగించి, చల్లార్చి, వాటిని వడకట్టి, ఆ ఆకుపచ్చ నీటిని) ఆ నీటితో ఎనిమా చేసుకోవాలి. ఇలా ప్రతిరోజు మూడు, నాలుగు రోజుల పాటు వేపనీటి ఎనిమా వల్ల ప్రేగులలో గోడలకు పట్టిన ఎమీబియాసిస్, నులిపురుగులు ఆ చేదుకు బయటకు కొట్టుకొస్తాయి.
5) వేప నీరు నాలుగు రోజులు ఎనిమాలో నానాక రెండు, మూడు రోజులు మామూలు గోరువెచ్చని నీరుతో ఎనిమా చేసి ఆపితే సరిపోతుంది.
6) పేగులలో మనల్ని రక్షించే ఉపయోగపడే సూక్ష్మజీవులు త్వరగా తయారవడానికి ఉదయం టిఫిన్ క్రింద పెరుగన్నాన్ని మాత్రమే (రాత్రి అన్నములో ముడిబియ్యం అయితే మంచిది, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, పాలు పోసి తోడుపెట్టుకుని అలా ఉంచి తింటే మంచిది. ఆ అన్నంలోఉపయోగపడే సూక్ష్మజీవులు పెరుగుతాయి.
7) మధ్యాహ్నం, సాయంకాలం
'మాత్రం మలబద్ధకం రాకుండా జాగ్రత్తగా ఆహారనియమాలు పాటించాలి.
8) ఇంకా ఎమీబియాసిస్ పోనట్లు అనిపిస్తే 20, 25 రోజుల తరువాత మరలువేపనీటి ఎనిమా 4, 5 రోజులు వరసనే చేసి ఆపితే సరిపోతుంది.
9) దానిమ్మ పండు బెరడు (తొక్క) కొద్దిగా తీసుకొని ఒక గ్లాసు నీళ్లలో వేసి సగం అయ్యే వరకు మరిగించి
బెల్లం కలుపుకొని రాత్రి నిద్రించే ముందు తాగించాలి.