ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లా కోడుమూరులో కొండపై వెలసిన కొండలరాయుడి ఆలయంలో తేలుని దేవుడిలా పూజిస్తారు. కొండలరాయుడి స్వామి శ్రీ వేంకటేశ్వర స్వామి ప్రతిరూపంగా భక్తులు కొలుస్తారు. ప్రతి ఏడాది శ్రావణమాసం మూడవ సోమవారం ఇక్కడ విశేష పూజలు జరుగుతాయి. కొండపై ఏ రాయిని కదిపినా తేలు ప్రత్యక్షమవుతుంది. కొండపై చేరుకున్న భక్తులు మొదట తేళ్లవేట కొనసాగిస్తారు. తేలు దొరికితే చాలు అదృష్టంగా భావిస్తారు. దానికి దారం కట్టి స్వామికి హారంగా అలంకరించి పూజిస్తారు. ఇలా చేయటం వలన తాము కోరిన కోర్కెలు నెరవేరుతాయని భక్తులు నమ్మకంగా చెపుతారు. కొండపై స్వామి మహిమ వల్ల పట్టుకున్నా తేళ్లు హాని చేయవని ఒకవేళ కుట్టినా గుడి చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేస్తే నొప్పి వుండదని అంటారు.
Post a Comment
0Comments
3/related/default