తెలంగాణలో వైన్ షాపుల పెంపు?

Telugu Lo Computer
0


ప్రభుత్వం రెవెన్యూను మరింత పెంచుకునే నేపథ్యం లో మద్యం షాపుల సంఖ్య ను మరింత పెంచనున్నట్లు సమాచారం అందుతోంది. ఈ ఏడాది అక్టోబర్‌ నాటికి ఇప్పుడున్న 2216 లిక్కర్‌ షాపుల లైసెన్సులు ముగుస్తాయి. ప్రభుత్వం లోని ఎక్సైజ్‌ విభాగం కొత్త మద్యం పాలసీని సెప్టెంబర్‌ చివరి నాటికి తేవాలని చూస్తోంది. ఇందులో భాగంగానే.. అదనంగా మరో 200 మద్యం షాపులకు లైసెన్సులు ఇవ్వనున్నట్లు సమాచారం అందుతోంది. ఇక నిర్ణయాన్ని తెలంగాణ ప్రభుత్వం నిజంగానే అమలు చేస్తే సర్కార్‌ ఖజానా మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ కొత్త మద్యం షాపులను హైదరాబాద్‌ కరీంనగర్‌, వరంగల్‌ లాంటి నగరాల్లోనే ఎక్కువగా అనుమతులు ఇస్తారని తెలుస్తోంది.  బీర్లపై రూ. 10 మేర ధరలను తెలంగాణ ప్రభుత్వం తగ్గించిన సంగతి తెలిసిందే.

Post a Comment

0Comments

Post a Comment (0)