ఒకప్పటి రోజుల్లో అక్షర జ్ఞ్యానం వున్నా ప్రతి వ్యక్తి - ప్రైవేట్ డిటెక్టివ్ నవలలు చదివిన వారే . చదివి - టెన్త్ తప్పిన వారు - ఇంటర్ తప్పిన వారు - డిగ్రీ తప్పిన వారు వేయి మంది వున్నారు - నాకు తెల్సి . మిస్సమ్మ సినిమాలో - ఏ ఎన్నార్ - ప్రవేట్ డిటెక్టివ్ . డిటెక్టీవ్ నవలలు చదివి - అసలు చదువు డింకీ కొట్టించినట్లు తెలుస్తుంది . ఎలాగంటే - అల్లా కాకపోతే - ఎన్ఠీఆర్ టీచరుగాను - ఏ ఎన్నార్ హెచ్ యం - గా ఉండేవారు గదా ?
మధుబాబు - షాడో - భగవాన్ - కొమ్మూరి సాంబశివరావు - కొన్ని గుర్తున్న పేర్లు . డిటెక్టివ్ లు చదివాము గాని - ఆ డిటెక్టివ్ పని చేసి లక్షలు సంపాదించటం గురించి ఆలోచించలేదు .
డైరెక్ట్ గా విషయానికి వస్తాను . ఖరీదైన కార్లను దొంగిలించి - ఓడల్లో వేసి వేరే దేశాలలో తక్కు వ ధరకు అమ్మే దొంగలు వున్నారు . దీన్నిగురించి తెలుసుకొని - ఒకాయన ప్రైవేట్ డిటెక్టివ్ అవతారం ఎత్తి - వేలాది మంది కి జాబులు - ఇచ్చి తానూ కోట్లు సంపాదిస్తూ వున్నాడు .
ఈ ప్రైవేట్ కంపెనీ - ఒక సాఫ్ట్ వేరు రూపొందించి - దాన్ని ఒక చిన్న బాక్స్లో పెట్టి దీన్ని కారులో అమర్చుకోండి అన్నది . కార్లతయారీ దారులే దీన్ని - ఇంజనుతో అనుసంధానం చేసి బిగిస్తారు . దీని వల్ల- కారు కదలాలి అంటే - ఈ బాక్స్ లోని ఈ సాఫ్ట్ వేరు అనుమతి తప్పని సరి అయిపోతుంది. . ఒక కారులోని బాక్స్ ఇంకో కారుకు పని చేయదు . బాక్స్ లేనిదే కారు పని చేయదు .
నాకారు దొంగతనం జరిగింది - అని కారు యజమాని - సాఫ్ట్ వేరు కంపెనీకి ఫోన్ చేయాలి . కారులో వున్నాసాఫ్ట్వేర్ బాక్స్ జీపీఎస్ ద్వారా - ఎల్లప్పుడూ కంపెనీకి - కనెక్ట్ అయ్యి ఉంటుంది . దాంతో కారు ఎక్కడఉన్నదీ - నిమిషాలలో కనిపెట్టి - ఆ ప్రాంతములో వున్నా పోలీసులకు " ఫలానా నెంబర్ గల కారు బాలనా ప్రదేశము లో వున్నది - అది దొంగిలింపబడినదని మా క్లయింట్ అంటున్నారు . మీరు వెళ్లి పరిశోధించండి " అని అడుగుతారు .
పోలీసులు -వెళ్లి - ఆ కారును స్వాధీనం చేసుకుంటారు .
అలా కాకుండా - కారు రోడ్డు మీద సర్రున పోతూ వుంది . పోలీసులను చూసి - దొంగ స్పీడ్ పెంచాడు . ఇప్పుడు పోలీసులు - కార్ని ఛేజు చేయాలి . దొంగ మీద కాల్పులు జరపాలి . ఇదంతా జరిగితే రోడ్డుమీద - రోడ్డు పక్కన - రోడ్డు దాటుతున్న వారికి ఎంతో ప్రమాదం జరిగే వీలుంది .
సరిగ్గా ఇక్కడే మన ప్రెవేటు డిటెక్టీవ్ రంగ ప్రవేశం చేశాడు ." ఎస్ - కారు దొంగిలించబడింది - అని పోలీసులు కన్ఫర్మ్ చేయగానే - జీపీ ఎస్ ద్వారా - కారులోని బాక్స్ కి అదనపు సందేశాలు పంపుతాడు . ఆ సందేశాలోని సారాన్ని గ్రహించిన కారు --
నిమిషానికి ఇంత అని స్పీడ్ తగ్గుతూ పోయి చివరికి స్లో మోషన్ లో ఆగిపోతుంది . ఎక్సలేటర్ ఎంత నొక్కితే అంతగాస్పీడ్ తగ్గుతుంది కూడా ఇలా ఎందుకంటే - కారు వేగంగా పోతూ పోతూ ఉన్నదల్లా - ఉన్నట్లు ఉండి షేడెన్ గా ఆగిపోతే చాలా ప్రమాదం కనుక - ఇలా స్లో మోషన్ లో అగే ఏర్పాటు చేశారు .
దొంగేమో - కారులో ఆయిల్ లేక ఆగి పోయింది - అనుకుంటూ బిక్క ముఖం వేసుకుని - పోలీసులకు లొంగి పోతాడు .
మీ కంప్లైంట్ రాగానే - మీ కు దొంగను పట్టి - మీకారు మీకు ఇప్పించాము . మా ఫీజు మాకు ఇవ్వండి " అని ఈ ప్రైవేట్ డిటెక్టివ్ అడుగుతాడు . ఒక్కో సారి ఎడ్వాన్ పేమెంట్ కూడా అడుగుతాడు . కారు దొరికింది కదా ఇంకా పేమెంట్ ఎందుకని - తోక జాడిస్తే - కారు కి ఇచ్చిన స్లో మోషన్ సందేశాలు - వెనక్కి తీసుకోరు . ఫీజు కట్టి కారెక్కలి .
నా చిన్న తనంలో - మీ చిన్న తనంలో నూ - ఈ తెలివి నాకుంటే - నేను కోటీశ్వరుడిని అయ్యి - పోయి ఉండేవాడిని . నాతో పాటు మీరు కూడా