విద్యార్థినిపై గ్యాంగ్ రేప్

Telugu Lo Computer
0


కర్ణాటకలోని  మైసూర్ సమీపంలో ఓ కాలేజీ విద్యార్థినిపై గ్యాంగ్​రేప్ జరిగింది. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం తన బాయ్​ఫ్రెండ్​తో కలిసి యువతి మైసూర్ సిటీకి 13 కిలోమీటర్ల దూరంలోని చాముండి హిల్స్ ప్రాంతానికి వెళ్లింది. అక్కడి నుంచి బైక్​పై తిరిగి వస్తుండగా కొందరు యువకులు వారిని అడ్డగించారు. వారి దగ్గరున్న డబ్బులివ్వాలని దుండగులు డిమాండ్ చేశారు. అయితే వారికి డబ్బులు ఇచ్చేందుకు యువతి, ఆమె బాయ్​ఫ్రెండ్ నిరాకరించారు.  దీంతో ఆ గ్యాంగ్ యువతి బాయ్​ఫ్రెండ్ పై దాడికి పాల్పడ్డారు. అనంతరం యువతిని గ్యాంగ్ లోని ఇద్దరు వ్యక్తులు రేప్ చేశారు. లలితాద్రిపుర రహదారి వద్ద యువతిపై అత్యాచారానికి పాల్పడినట్లు సమాచారం. ప్రస్తుతం బాధితులిద్దరూ(యువతి, యువకుడు) హాస్పిటల్ లో ట్రీట్మెంట్ పొందుతున్నారు. ఘటనపై ఆలనహళ్లి పోలీస్ స్టేషన్​లో కేసు నమోదైంది. ఐసీసీ సెక్షన్ 376-D కింద గ్యాంగ్ రేప్ కేసు నమోదుచేశారు. నిందితులను గుర్తించి పట్టుకునేందుకు గాలిస్తున్నామని, దర్యాప్తు కొనసాగుతుందని పోలీసులు తెలిపారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)