ఆర్‌బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా అజయ్ కుమార్

Telugu Lo Computer
0

 

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఈడీ)గా అజయ్ కుమార్ నియమితులయ్యారు. 2021 ఆగస్టు 20 నుంచి ఆయన నియామకం అమల్లోకి వచ్చినట్టు ఆర్బీఐ ఒక ప్రకటనలో పేర్కొంది. కరెన్సీ మేనేజిమెంట్ డిపార్ట్‌మెంట్ వ్యవహారాలు అజయ్ కుమార్ చూసుకుంటారని తెలిపింది. ఆర్బీఐ ఈడీగా ప్రమోషన్ రావడానికి ముందు, ఆర్బీబీ న్యూఢిల్లీ ప్రాంతీయ కార్యాలయం రీజినల్ డైరెక్టర్‌గా అజయ్ కుమార్ పనిచేశారు. ఆర్బీఐలో మూడు దశాబ్దాలుగా సేవలందిస్తున్న ఆయన విదేశీ మారకద్రవ్యం, బ్యాంకింగ్ పర్యవేక్షణ, ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్, కరెన్సీ మేనేజిమెంట్‌తో సహా పలు శాఖల్లో పనిచేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)